
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


మొదటి నుండి కాస్త డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తుంటాడు డైరక్టర్ తేజ. తాను డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా 'చిత్రం' ఆ తర్వాత వరుసగా 'నువ్వు నేను', 'జయం' ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఒక్క 'నువ్వు నేను' సినిమాకే ఆరు నంది అవార్డులు వచ్చాయంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన 'సీత' బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి.