
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు



భారతీయ సినీ ప్రపంచానికి కొత్త పుంతలు తొక్కించిన విజనరీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి జన్మదినం సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు రాజమౌళికి ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలియజేస్తూ, ఆయన సృజనాత్మకతకు మళ్ళీ మరొకసారి సెల్యూట్ చేశారు.

సినిమా అంటే కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, అదొక విశ్వాసం, అదొక బ్రాండ్ అని నిరూపించిన సృజనశీలి, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. తెలుగు గడ్డపై పుట్టి, తన అద్భుతమైన సృజనాత్మకతతో భారతీయ సినిమాను ప్రపంచ సినిమా వేదికపై సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనది. అక్టోబర్ 10న ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన వ్యక్తిగత జీవితం నుండి అంతర్జాతీయ ఖ్యాతి వరకు సాగిన అద్భుత ప్రయాణాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.