
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


ప్రముఖ నిర్మాత, సీనియర్ సినీ పీఆర్వో బిఏ రాజు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే కదా. బిఏ రాజు మరణంతో ఇండస్ట్రీ నిజంగా ఒక మంచి పీఆర్వోని కోల్పోయినట్టే. అలాంటి పీఆర్వో ఇప్పటివరకూ లేడు..ఇకపై రాడు అన్నంత పేరు తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్క సినిమా గురించి ఆయన దగ్గర అప్ డేట్ ఉంటుంది. కలెక్షన్ల్ రిపోర్ట్ ఉంటుంది. రిలీజ్ డేట్ లు నాలుకపైనే ఉంటాయి. ఇలా ప్రతి క్షణం సినిమాల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టే మేకర్ కూడా తనపై నమ్మకంతో ఉండేవాళ్లు.. దీంతోనే ఇండస్ట్రీలో వేయి పైగా సినిమాలకు పీఆర్వో గా పనిచేశాడు.