
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ -తమన్నా , వరుణ్ తేజ్ - మెహరీన్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్" F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అనిల్ తెరకెక్కించిన " F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది. హీరోలు వెంకటేష్ , వరుణ్ తేజ్ తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. " F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ సీక్వెల్ "F 3" మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.