
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. ఆయన కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ డీసెంట్ వసూళ్లతో దూసుకుపోతుంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని విజయవంతంగా అధిగమించింది. దీంతో అఖిల్ కెరీర్‌లోనే తొలి రూ. 100 కోట్ల గ్రాసర్ చిత్రంగా ‘లెనిన్’ సరికొత్త ఘనత సాధించింది.