
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించిన దగ్గర నుండి ఈసినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే ధనుష్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనాగచైతన్యహీరోగా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద నారాయణదాస్ కె నారంగ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఇదే బ్యానర్ లో శేఖర్ కమ్ముల ధనుష్ తో సినిమా తీయనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా తెరకెక్కనుంది…