కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

whom do you like more in a natural avatar
ముగిసింది

మీకు నచ్చిన న్యాచురల్ బ్యూటీ?

Whom Do You Like More in a Natural Avatar

ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన హీరోయిన్స్ ఇప్పుడు మాత్రం తమ పంథా మార్చుకుంటున్నారు. ఈమధ్య లేడీ ప్రధానమైన పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఆ దిశగా అడుగులు కూడా వేశారు. కెరీర్ ప్రారంభించిన కొన్నిరోజులు గ్లామర్ రోల్స్ చేసినా ఇప్పుడు మాత్రం డిఫరెంట్ రోల్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కథలో బలం ఉంటే హీరోయిన్స్ డీ గ్లామర్ పాత్రలు చేసినా ఆడియన్స్ అంగీకరిస్తారన్న విషయం నిరూపిస్తున్నారు. మరి ఈమధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ న్యాచురల్ లుక్ తో ఆడియన్స్ ను ఫిదా చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రంగస్థలం సినిమాలో న్యాచురల్ లుక్ లో కనిపించి చాలా చక్కగా నటించి మెప్పించింది. ఇక రష్మిక కూడా ఒకవైపు స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్నా కూడా గ్లామర్‌ ఇమేజ్‌ ను సైతం పక్కన పెట్టి పుష్ప సినిమాలో డీగ్లామర్ పాత్రలో నటించి అచ్చమైన పల్లె పిల్లలా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ కూడా లంగా ఓణిలో అచ్చమైన తెలుగు పిల్లలా కనిపించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు జాన్వీకపూర్ కూడా దేవర సినిమాలో న్యాచురల్ లుక్ తోనే రాబోతున్నారు. మరి వీరిలో మీకు నచ్చిన న్యాచురల్ బ్యూటీ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్