కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Who do you think is the biggest Mass Hero,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Rebel Star Prabhas,Mass Best Hero Prabhas,Prabhas Upcoming Movies,Prabhas Latest Movie U
ముగిసింది

పోల్ గేమ్ :ఈ స్టార్ హీరోస్ లో బిగ్గెస్ట్ మాస్ హీరో ?

Who do you think is the biggest Mass Hero

యాక్షన్ మూవీ "ఈశ్వర్" తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ సూపర్ హిట్ "వర్షం"మూవీ తో యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు.బ్లాక్ బస్టర్ "ఛత్రపతి " మూవీ లో ఫైట్స్ , సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మాస్ ఆడియెన్స్ ను అలరించారు. "యోగి ", "బిల్లా", "మిర్చి " వంటి సూపర్ హిట్ యాక్షన్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "మిర్చి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రభాస్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి", "బాహుబలి 2"మూవీస్ తో ప్రభాస్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో"మూవీ తో ప్రభాస్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. పలు మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మహేష్ బాబు సక్సెస్ ఫుల్ "రాజకుమారుడు "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. "ఒక్కడు ", "అతడు ", "పోకిరి ", "దూకుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ లో డిఫరెంట్ డైలాగ్ డెలివరీ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మహేష్ బాబు ప్రేక్షకులను అలరించారు. "శ్రీమంతుడు ", "భరత్ అనే నేను ", "మహర్షి ", "సరిలేరు నీకెవ్వరు ", "సర్కారు వారి పాట " వంటి సూపర్ హిట్ మూవీస్ లో మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. "బ్రహ్మర్షి విశ్వామిత్ర "మూవీ తో టాలీవుడ్ కు బాలనటుడిగా పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ , బాల నటీ నటులతో తెరకెక్కిన "రామాయణం"మూవీ లో రాముడు గా లీడ్ రోల్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "నిన్ను చూడాలని "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ తన రెండవ మూవీ "స్టూడెంట్ నెం 1 "మూవీ తో ఘనవిజయం సాధించారు. "ఆది ", "సింహాద్రి ", "సాంబ", "అశోక్ ", "రాఖీ ", "యమదొంగ ""అదుర్స్ ", "బృందావనం "మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించారు. "టెంపర్" మూవీ నుండి ""ఆర్ ఆర్ ఆర్ " మూవీ వరకూ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. , సూపర్ హిట్ "చిరుత "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్ ఆ మూవీ లో ఫైట్స్ , సాంగ్ సీక్వెన్స్ లలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఫాంటసీ , యాక్షన్ మూవీ “మగధీర “ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో “మగధీర ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది."రచ్చ ", నాయక్ ", "ఎవడు ", "ధృవ ", "రంగస్థలం ", "ఆర్ ఆర్ ఆర్ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో ఫైట్స్ , సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రేక్షకులను అలరించారు. మ్యూజికల్ హిట్ “గంగోత్రి ” మూవీ తో అల్లు అర్జున్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “ఆర్య” మూవీ ఘనవిజయం సాధించింది. “బన్నీ “, "దేశముదురు" , “పరుగు “, బద్రీనాథ్ “, “జులాయి” , “ఇద్దరమ్మాయిలతో ” , “S/O సత్యమూర్తి “, “సరైనోడు “, DJ”, “అల వైకుంఠపురములో .. “ వంటి సూపర్ హిట్ మూవీస్ లో ఫైట్స్ , డ్యాన్స్ లతో అల్లు అర్జున్ ప్రేక్షకులను అలరించి స్టైలిష్ హీరోగా పేరుపొందారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ “ మూవీ లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ న భూతో న భవిష్యతి అన్న చందంగా నిలిచింది. ఈ మూవీ తో అల్లు అర్జున్ నార్త్ లో కూడా క్రేజీ హీరోగా మారారు.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్