కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Which Song from BRO Movie Impressed You The Most
ముగిసింది

బ్రో- ఈరెండు పాటల్లో మీకు నచ్చిన పాట?

Which Song from BRO Movie Impressed You The Most?

ప్రస్తుతం సీని ప్రేక్షకులు అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్న సినిమాల్లో బ్రో సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. మెగా హీరోల కాంబినేషన్ అందులోనూ మామ అల్లుళ్ల కాంబినేేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక క్రేజ్ ను ఆ అంచనాలను ఎక్కడా తగ్గించకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండీ ఇప్పటివరకూ రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ వరకూ అలా పెంచుతూనే వస్తున్నారు. జులై 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగిస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ముందుగా మై డియర్ మార్కండేయ అనే బీట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాటలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ ఉండగా తమ స్వాగ్ తో ఆకట్టున్నారు. ఇక తాజాగా జానవులే నెర జానవులే అనే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ మధ్య వచ్చే ఈ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. రెండూ డిఫరెంట్ జోనర్ లో వచ్చిన పాటలు కావడంతో మంచి వ్యూస్ ను సొంత చేసుకుంటున్నాయి. మరి ఈ రెండు పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏదో మీ ఓటు ద్వారా తెలపండి..

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్