
మీకు నచ్చిన పవన్ రీమేక్ మూవీ?
Which Pawan Kalyan Remake Movie Impressed You The Most?
ఈమధ్య కాలంలో రీమేక్ చేయడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు సైతం రీమేక్ లు చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక పవర్ స్టార్ కూడా ఈమధ్య చాలా సినిమాలు రీమేక్ లే చేసుకుంటూ వెళుతున్నారు. ఇక రీమేక్ ల ద్వారా కూడా బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టాడు పవన్. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గబ్బర్ సింగ్ సినిమా గురించి. ఈసినిమా హిందీలో వచ్చిన దబాంగ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూశాం. మధ్యలో రాజకీయాలతో బిజీగా ఉండి సినిమాలు చేయనని చెప్పారు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడినా.. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోతారా అని ఆసక్తిగా ఎదురుచూసుకుంటూ వచ్చారు. వారి కోరిక మేరకు మళ్లీ సినిమాలను మొదలుపెట్టారు పవన్. ఇక రీఎంట్రీ తరువాత పవన్ నుండి వచ్చిన రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే అవి హిందీలో సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ అయిన వకీల్ సాబ్, అలానే మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ అయిన భీమ్లానాయక్. రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. దీంతో మరోసారి పవన్ సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించారు. కలెక్షన్స్ పరంగా కూడా రెండు సినిమాలు ఎక్కడా తగ్గకుండా భారీ కలెక్షన్స్ ను రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. మరి పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన రీమేక్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
పోల్స్



