కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Which Latest First Look of Ravi Teja Impressed You The Most,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja First
ముగిసింది

మీకు బాగా నచ్చిన 'రవితేజ' ఫస్ట్ లుక్ పోస్టర్..?

Which Latest First Look of Ravi Teja Impressed you the most

కొన్నేళ్లుగా సరైన విజయం లేక వెనుక పడ్డ మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో మళ్లీ పుంజుకున్నాడు. ఇక అదే క్రేజ్ తో ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం తన లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉండగా అందులో ముందుగా రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు కూడా రిలీజ్ అవ్వగా అవి బాగానే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంకా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా చేస్తున్నాడు. శరత్ మాండవ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ దశలోనే ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వచ్చి చాలా రోజులే అవ్వగా.. ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక రీసెంట్ గానే రావణాసుర సినిమాను కూడా ప్రారంభించాడు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న రావణాసుర సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా ఈసారి కూడా రవితేజ మరో డిఫరెంట్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా రవితేజ ని డిఫరెంట్ క్యారెక్టర్ లో సుధీర్ వర్మ చూపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు మరి ఈ సినిమాల్లో మీకు బాాగా నచ్చిన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్