కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Which Kannada Dubbed Movie Impressed You The Most, Kannada Dubbed Movie, K.G.F: Chapter 2, Vikrant Rona, 777 Charlie, Kantara Movie Collections, Kantara Movie Latest Collections, Rishab Shetty, Sapthami Gowda, Rishab Shetty Latest Movie, Rishab Shett
ముగిసింది

పోల్ గేమ్ : 2022 లో రిలీజ్ అయిన ఏ కన్నడ డబ్బింగ్ మూవీకి మీ ఓటు ?

Which Kannada Dubbed Movie Impressed You The Most?

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ సీక్వెల్ కెజిఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. రవి బస్రూర్ సంగీతం అందించారు.ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పరం వహ్ స్టూడియోస్ బ్యానర్ పై కిరణ్ రాజ్ కె దర్శకత్వంలో రక్షిత్ శెట్టి , సంగీత సింగేరి జంటగా మనుషులకి , జంతువులకి ఎమోషనల్ బంధం నేపథ్యంలో తెరకెక్కిన అడ్వెంచర్ కామెడీ డ్రామా 777 చార్లీ కన్నడ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ జూన్ 10 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి. నోబిన్ పాల సంగీతం అందించారు. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 777 చార్లీ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ విక్రాంత్ రోణ కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ సాధించింది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. విక్రాంత్ రోణ మూవీ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ ఇతర భాషలన్నింటిలోనూ 60 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్