
'వకీల్ సాబ్' లో మీకు నచ్చిన సాంగ్..?
Which Is Your Favourite Song From Vakeel Saab Movie
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కావడంతో ‘వకీల్ సాబ్’ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. గత ఏడాది మగువ మగువ సాంగ్ రిలీజ్ అవ్వగా ఆ పాట తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని రెండో పాట విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సత్యమేవ జయతే అంటూ ఈ మధ్యే విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మగువ మగువ, సత్యమేవ జయతే పాటలు ఎమోషనల్ గా ఉండగా తాజాగా ఈసినిమా నుండి కంటిపాప అనే రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. మూడు పాటలకు కూడా సూపర్ గా శ్రోతలను ఆకట్టుకున్నాయి. తనకు ఎంతో ఇష్టమైన పవన్ సినిమా కు పనిచేసే అవకాశం రావడంతో ఆ అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఈపాటలు చూస్తుంటేనే తను ఎంత ఇంట్రెస్టింగ్ గా పనిచేస్తున్నాడో తెలుస్తుంది. మరి ఇప్పటివరకూ రిలీజ్అయిన మూడు పాటల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న పాట ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
పోల్స్



