కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Which Is Your Favorite Movie Of Super Star Mahesh Babu,Pokiri,Dhookudu,Okkadu,Seethamma Vakitlo Sirimalle Chettu,Srimanthudu,Bharat Ane Nenu,Sarileru Neekevvaru,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Super Star Mahesh Babu,Mahesh Babu Latest Movi
ముగిసింది

మీకు బాగా నచ్చిన మహేష్ సినిమా..?

Which Is Your Favorite Movie Of Super Star Mahesh Babu?

టాలీవుడ్ రాకుమారుడు ఎవరంటే టక్కున ఎవరైనా సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పేస్తారు. నిజంగానే రాకుమారుడు లాగ ఉంటాడు కాబట్టి ప్రిన్స్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారస్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తన సినిమాలతో ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు. తండ్రి లాగే మహేష్ కూడా పలు ప్రయోగాలు చేస్తుంటాడు. రొటీన్ గా ఉండే సినిమాలు కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉంటే కథలను ఎంచుకుంటూ ఉంటాడు. ఒక్కో సారి అవి సరైన ఫలితం ఇవ్వలేకపోయినా మహేష్ మాత్రం రిజల్ట్ ను పట్టించుకోకుండా కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. చిన్నప్పుడే తన హుషారైన నటనతో.. ఆ టైంలోనే ఫైట్స్ కూడా చేసి అందరినీ ఆకట్టున్నాడు. ముగ్గురు కొడుకులు,గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాల చంద్రుడు ఇలా పలు సినిమాల్లో బాలనటుడిగా నటించి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రాజకుమారుడు చిత్రంతో హీరో అయ్యాడు. ఇక ఇప్పటి వరకూ తన కెరీర్ లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న మహేష్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక మహేష్ కు అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ నుండి కూడా వెల్లువలా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. కాగా ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరి ఈసందర్భంగా మహేష్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేసి బర్త్ డే విషెస్ అందించండి..

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్