కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Which Among These Is The Best Combination? Vote Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies,Telugu OTT Movies, S. S. Rajamouli,Student No 1 Movie,SS
ముగిసింది

పోల్ గేమ్ : ఎన్టీఆర్ కాంబినేషన్ లో బెస్ట్ డైరెక్టర్ ?

Which Among These Is The Best Combination? Vote Now

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో స్వప్న సినిమా బ్యానర్ పై తెరకెక్కిన “స్టూడెంట్ నెం 1”, విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన “సింహాద్రి “, విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన “యమదొంగ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం "మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , వినాయక్ కాంబినేషన్ లో లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన "ఆది ", కొడాలి మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కిన "సాంబ ", అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన "అదుర్స్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. కామెడీ టచ్ తో , యాక్షన్ ఎంటర్ టైనర్ గా "అదుర్స్ " మూవీని తెరకెక్కించి దర్శకుడు వినాయక్ అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ , సమంత జంటగా రూపొందిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “జనతా గ్యారేజ్ “మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించారు. హీరో ఎన్టీఆర్ , మోహన్ లాల్ ల స్క్రీన్ ప్రెజెన్స్ , పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొరటాల శివ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో "NTR30"మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టెంపర్ ” మూవీ ఘనవిజయం సాధించింది. కరెప్టెడ్ , క్రిమినల్ మైండ్ పోలీస్ ఆఫీసర్ గా తరువాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మారడం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో ఎన్టీఆర్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.. “టెంపర్ ” మూవీ తమిళ భాషలో “అయోగ్య “గా రీమేక్ అయ్యి తిరిగి తెలుగు లో డబ్బింగ్ కావడం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “నాన్నకు ప్రేమతో “మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ , రకుల్ జోడీ ప్రేక్షకులను అలరించింది. తండ్రి, కొడుకుల మధ్య అనుబంధాన్ని ఒక రివెంజ్ స్టొరీగా మార్చి తెరకెక్కించిన సుకుమార్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా “అరవింద సమేత వీర రాఘవ “మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా రాయలసీమ యాసలో తారక్ చెప్పిన డైలాగ్స్, తన మాడ్యులేషన్ స్టైల్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్