కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Vote for your favourite film of Mega Powerstar Ram Charan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega Power Star Ram Charan,Ram Charan,Ram Charan Latest Movie Updates,Ram Charan
ముగిసింది

పోల్ గేమ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్ లో బెస్ట్ మూవీ ?

Vote for your favourite film of Mega Powerstar Ram Charan

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైమ్ జంటగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ మూవీ “మగధీర “ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో “మగధీర ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. కాలభైరవ , హర్షగా ద్విపాత్రాభినయం తో రామ్ చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన రెండవ మూవీ “మగధీర ” లో తన అద్భుతమైన డ్యాన్స్ , ఫైట్స్ తో ప్రేక్షకులను రామ్ చరణ్ అలరించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “ధృవ “మూవీ ప్రేక్షకాదరణ పొంది కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ధృవ అనే పోలీసాఫీసర్ పాత్రలో హీరో రామ్ చరణ్ తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ధృవ పాత్ర కై ఎంతోకష్టపడి బిల్డప్ చేసిన ఫిజిక్‌తో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను అలరించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ,సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ ఘనవిజయం సాధించింది. వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ గోదావరి యాసలో మాట్లాడుతూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ కి రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్