కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

#PSPK28.. ఏ అప్ డేట్ వస్తుందనుకుంటున్నారు..?
ముగిసింది

#PSPK28.. ఏ అప్ డేట్ వస్తుందనుకుంటున్నారు..?

PSPK28: What Are Your Expectations On Updates Releasing Tomorrow?

రేపు సెప్టెంబర్ 2... పవన్ అభిమానులకు ఎప్పుడూ గుర్తుండే రోజు ఇది.. ఈ రోజు కోసం ఏడాది అంతా ఎదురు చూస్తూనే ఉంటారు. ఇక పవన్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పేదేముంది. ఆయన అలా ఊరికే నడిచొచ్చినా చాలు సినిమా చూసే అభిమానులు ఉన్నారు ఆయనకు. రాజకీయాల్లోకి వెళ్తూ ఇంకా సినిమాలు చేయనని చెప్పినప్పుడు కాస్త నిరాశపడినా ఆయన సినిమాలు చేసినా.. రాజకీయాల్లో ఉన్న ఆయన వెంటే మేముంటాం అని తోడుగా ఉండే అభిమానులు ఆయన సొంతం. ఇక రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడు అని చెప్పగానే ఫ్యాన్స్ ఆనందం అంత ఇంతాకాదు. ఇక ఇప్పుడు ప్రస్తుతం పవన్ మూడు సినిమాలు చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ సినిమా నుండి రేపు సాయంత్రం ఒక అప్ డేట్ రానున్న సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం 4.5 నిమిషాలకు అప్ డేట్ ఇవ్వనున్నారు. అయితే ఏ అప్ డేట్ ఇస్తారన్నది మాత్రం ఇంకా సస్పెన్సే. మరి ఏ అప్ డేట్ ఇస్తారో సరదాగా మనం ఒక గెస్ కొడదాం. ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్? టైటిల్ అనౌన్స్ మెంట్? ఏ అప్ డేట్ ఇవ్వనున్నారు.. మీ ఓటు ద్వారా తెలపండి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్