
భీమ్-రామరాజు మీకు నచ్చిన పోస్టర్..?
POLL Which Among These Two Looks Of Jr NTR And Ram Charan Impressed You The Most Vote Now
దర్శకధీరుడు రాజమౌళి తన సినిమా కు సంబంధించిన ప్రమోషన్స్ ఎలా చేస్తాడో అందరికీ తెలిసిందే కదా. తన సినిమా మొదలైనప్పటినుండీ రిలీజ్ అయ్యేవరకూ ఏదో ఒక క్యూరియాసిటీని పెంచుతూనే ఉంటాడు. ఒక్కోసారి అప్ డేట్స్ ఇవ్వడంలో లేట్ అవ్వొచ్చేమో కానీ ఇస్తే మాత్రం క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్-చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న సినిమా.. దానికితోడు రాజమౌళి డైరెక్షన్ సినిమా అంటే చెప్పేదేముంది ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయే. ఇక పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టే ప్రమోషన్స్ ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. దానిలో భాగంగానే ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ లు ఎన్నో పోస్టర్లు, పాటలు రిలీజ్ అయ్యాయి. అన్నీ భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని మిలియన్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో రెండు పవర్ ఫుల్ పోస్టర్స్ ను రిలీజ్ చేశాడు. అవి ఎన్టీఆర్, చరణ్ కు సంబంధించిన పోస్టర్లు. ఈరోజు ఉదయం ఎన్టీఆర్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. సాయంత్రం చరణ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెండుపోస్టర్లు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. మరి ఈ పోస్టర్లలో మీకు నచ్చిన పోస్టర్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
పోల్స్



