కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

POLL: Which Among These Is Your Favourite Song From Pushpa The Rise Movie? Vote Now,Latest Telugu Songs,Pushpa Trailer,Pushpa Movie Trailer,Allu Arjun Pushpa Trailer,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,2021 Telugu Songs,2021 Latest Telugu Movie
ముగిసింది

పోల్ గేమ్ : "పుష్ప :ది రైజ్ " మూవీ సాంగ్స్ లో మీకు నచ్చిన సాంగ్ ?

POLL: Which Among These Is Your Favourite Song From Pushpa The Rise Movie? Vote Now

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా 2 భాగాలుగా పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.”పుష్ప ” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఫహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , అనసూయ ముఖ్యపాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ స్వరకల్పనలో చంద్ర బోస్ సాహిత్యం అందించిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. "పుష్ప :ది రైజ్ " మూవీ ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక సాంగ్ ను శివం ఆలపించారు. అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిన సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సెకండ్ సాంగ్ గా రిలీజ్ అయిన శ్రీ వల్లి సాంగ్ యానిమేషన్ షాట్స్ తో అద్భుతంగా తెరకెక్కింది. డిఫరెంట్ డ్యాన్స్ తో అల్లుఅర్జున్ ఆకట్టుకున్నారు. ఫోక్ సాంగ్స్ సింగర్ గానం చేసిన సామీ సామీ సాంగ్ థర్డ్ సాంగ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.ఈసాంగ్ లో మౌనిక యాదవ్ వాయిస్ , హీరోయిన్ రష్మిక డ్యాన్స్ పెర్ఫర్మెన్స్ హైలైట్ గా నిలిచాయి. సింగర్ నకాష్ అజీజ్ గానం చేసిన ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా మాస్ సాంగ్ ఫోర్త్ సాంగ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఉర్రూత లూగించింది. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్