పోల్ గేమ్ : అందాల రాశీఖన్నా బెస్ట్ మూవీ ?
Poll Game: Which Of These Would You Think Is The Best Movie Of Raashi Khanna?
వారాహి చలన చిత్రం బ్యానర్ పై శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య , రాశీఖన్నా జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "ఊహలు గుస గుస లాడే"మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ , తమన్నా , రాశీఖన్నా ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ కామెడీ "బెంగాల్ టైగర్ "మూవీ ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా తన పాత్ర పరిధి లో చక్కటి నటనను ప్రదర్శించి , తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ , రాశీఖన్నా జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ "సుప్రీమ్"మూవీ ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా ఒక ఫన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ లా "సుప్రీమ్"మూవీ ని దర్శకుడు అనిల్ తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "జై లవకుశ "మూవీ ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా , నివేద థామస్ కథానాయికలు. రాశీఖన్నా తన పాత్ర పరిధి లో చక్కగా పెర్ఫార్మ్ చేసి అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ , రాశీఖన్నా జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "తొలిప్రేమ "మూవీ ఘనవిజయం సాధించింది. హీరోయిన్ రాశీఖన్నా పెర్ఫార్మెన్స్ , వరుణ్ తేజ్ , రాశీఖన్నా ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించాయి. అల్లు అరవింద్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , GA 2 పిక్చర్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ , రాశీఖన్నా జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ప్రతి రోజూ పండగే "మూవీ ఘనవిజయం సాధించింది. టిక్ టాక్ స్టార్ గా నటించిన రాశీఖన్నా ఏ సందర్భం లో నైనా తనకు అనుకూలంగా మార్చుకునే అమ్మాయిగా ప్రేక్షకులను అలరించారు.
పోల్స్



