కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Poll Game: Which Is Your Favorite Movie Of Director Anil Ravipudi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Which Is Your Favorite Movie Of Director Anil Ravipudi,Director Anil Ravi
ముగిసింది

పోల్ గేమ్ : దర్శకుడు అనిల్ రావిపూడి బెస్ట్ మూవీ ?

Poll Game Which Is Your Favorite Movie Of Director Anil Ravipudi

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ "పటాస్ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో అనిల్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. పూర్తి వినోదాత్మకం గా "పటాస్" మూవీ ని తెరకెక్కించి దర్శకుడు అనిల్ తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ"సుప్రీమ్ " మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎమోషన్ , ఫన్ ఎలిమెంట్స్ , మంచి స్క్రీన్ ప్లే తో దర్శకుడు అనిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ "రాజా ది గ్రేట్ "మూవీ ఘనవిజయం సాధించింది. అంధుడైన హీరో (రవితేజ ) కు ఎలివేషన్ సీన్స్ , ఫైట్స్ తో ఈ మూవీ ని తెరకెక్కించి దర్శకుడు అనిల్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ లు హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "F 2 :ఫన్ &ఫ్రస్టేషన్"మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పూర్తి కామెడీ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీ ని దర్శకుడు తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ "సరిలేరు నీకెవ్వరు "మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. కామెడీ తో పాటు యాక్షన్ , ఎమోషన్ లతో ఈ మూవీని తెరకెక్కించి దర్శకుడు అనిల్ ప్రేక్షకులను అలరించారు.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్