
పోల్ గేమ్ : స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే బెస్ట్ మూవీ ?
Poll Game Which Is The Best Movie Of Actress Pooja Hegde
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య , పూజాహెగ్డే జంటగా రూపొందిన"ఒక లైలా కోసం "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన పూజాహెగ్డే తన ,అందం అభినయం తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "దువ్వాడ జగన్నాథమ్ " మూవీ ఘనవిజయం సాధించింది. గ్లామరస్ గా కనిపిస్తూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో పూజాహెగ్డే ప్రేక్షకులను అలరించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "అరవింద సమేత వీర రాఘవ "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో అందం ,అభినయం తో పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , వైజయంతీ మూవీస్ , పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , పూజాహెగ్డే జంటగా రూపొందిన "మహర్షి "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పూజాహెగ్డే స్టన్నింగ్ లుక్స్ , గ్లామరస్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "గద్దలకొండ గణేష్" మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పూజాహెగ్డే పాతతరం అమ్మాయిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ , పూజాహెగ్డే ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పోల్స్



