కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Poll Game: Which Among These Actresses Can Make The Best Pair With Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Poll Game,TFN Poll Game,Telugu Filmnagar Poll,Jr NTR,Young Tiger
ముగిసింది

పోల్ గేమ్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బెస్ట్ జోడీ ?

Poll Game: Which Among These Actresses Can Make The Best Pair With Jr NTR

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ , సమంత జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ "బృందావనం "మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ , సమంత జంటగా "రభస ", "జనతా గ్యారేజ్ "మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కాజల్ అగర్వాల్ జంటగా సూపర్ హిట్ "బృందావనం ", "బాద్ షా ", "టెంపర్ " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "జనతా గ్యారేజ్ "మూవీ కాజల్ ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "నాన్నకు ప్రేమతో "మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ , రకుల్ జోడీ ప్రేక్షకులను అలరించింది. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా "అరవింద సమేత వీర రాఘవ "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ , పూజాహెగ్డే ఫస్ట్ టైమ్ జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , నయనతార జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ"అదుర్స్ " మూవీ విజయం సాధించింది. హీరో ఎన్టీఆర్ , నయనతార అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీఆర్ , రాశీఖన్నా జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్"జై లవకుశ "ఘనవిజయం సాధించింది. హీరో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్