
ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో బెస్ట్ మూవీ ?
NTR Birthday Special Poll Game Which Is The Best Movie In Jr NTR and SS Rajamouli Combination
స్వప్న సినిమా బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పరివేక్షణ లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన "స్టూడెంట్ నెం 1" మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో రాజమౌళి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. దర్శకుడు రాజమౌళి యాక్షన్ సీన్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఫస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన "స్టూడెంట్ నెం 1" మూవీ 42 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సింహాద్రి “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ డ్యాన్స్ , యాక్షన్ సీన్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “సింహాద్రి “మూవీ ని తెరకెక్కించారు. “సింహాద్రి “మూవీ 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు రాజమౌళి , హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన సోషియో ఫాంటసీ “యమదొంగ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. దర్శకుడు రాజమౌళి “యమదొంగ ” మూవీని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గ్రాఫిక్స్ ద్వారా కనిపించడం , హీరో ఎన్టీఆర్ఒక సాంగ్ కు గళాన్ని అందించడం విశేషం. “యమదొంగ ” మూవీ 92 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది.
పోల్స్



