కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Naga Chaitanya Birthday Special Poll Which Among These Is Your Favourite Film VOTE NOW,Yuva Samrat Naga Chaitanya,Akkineni Naga Chaitanya,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya New Movie,Naga Chaitanya 3
ముగిసింది

మీకు బాగా నచ్చిన నాగచైతన్య సినిమా..?

Naga Chaitanya Birthday Special Poll Which Among These Is Your Favourite Film VOTE NOW

అక్కినేని వంశం మూడోత‌రం క‌థానాయ‌కుడుగా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన నటుడు నాగ చైతన్య. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జోష్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ యంగ్ హీరోకు మొదటి సినిమా మాత్రం ఫ్లాప్ నే మిగిల్చింది. అయినా కూడా ఎలాంటి నిరాశ చెందకుండా తను మాత్రం సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఆ తరువాత గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఏమాయ చేసావే చిత్రంలో ల‌వర్ బాయ్ గా అద్భుతంగా న‌టించి ఇండస్ట్రీలో తన మార్క్ ను వేశాడు. ఆత‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 100% ల‌వ్ సినిమాలో పాత్ర‌కు త‌గ్గ అభిన‌యం ప్ర‌ద‌ర్శించి మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ఏమాయ చేసావే, 100% ల‌వ్...ఈ రెండు రొమాంటిక్ మూవీస్ తో క్లాస్ హీరోగా సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. అయితే క్లాస్ ఒక్కటే సరిపోదు మాస్ హీరోగా కూడా ప్రేక్షకులకు దగ్గరవ్వాలి. ఆ ప్రయత్నలోనే ద‌డ‌, బెజ‌వాడ, త‌డాఖా లాంటి సినిమాలు తీశాడు. ఇక ఆతర్వాత వచ్చిన సినిమా మనంతో చైతూ మరో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. ఈసినిమాలో తాత నాగేశ్వర్రావు తో నాన్న నాగార్జున తో కలిసి నటించి రెండు డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ లో ఒదిగిపోయి..ఏ పాత్ర అయినా చైతు చేయ‌గ‌ల‌డ‌ని నిరూపించాడు. ఆ తర్వాత ఆటోన‌గ‌ర్ సూర్య, ఒక లైలా కోసం, దోచెయ్, ప్రేమమ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమాలు తీయగా వాటిలో ప్రేమమ్ తప్ప మిగిలినవి నిరాశనే మిగిల్చాయి. ఆ తర్వాత వచ్చిన యుద్దం శరణం, సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు, వెంకీమామ సినిమాలు పర్వాలేదనిపించాయి. ఆ తర్వాత మజిలీ, లవ్ స్టోరీ ల సూపర్ సక్సెస్ తో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ సినిమా చేస్తున్నాడు. అలాగే లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ముందు ముందు కూడా నాగ చైతన్య ఎన్నో బర్త్ డే లు జరుపుకోవాలని.. ఇంకా మరెన్నో మంచి మంచి సినిమాలు తీసి అందరినీ అలరించాలని కోరుకుందాం. మరి కింద ఇచ్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన నాగచైతన్య సినిమా ఏది అనేది మీ ఓటు ద్వారా తెలియచేయండి.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్