కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

For Which Ravi Teja’s Upcoming Movie You are Eagerly Waiting?,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Latest Tollywood Updates,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movies,Ravi
ముగిసింది

బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : హీరో రవితేజ అప్ కమింగ్ మూవీస్ లో ఏ మూవీకి మీ ఓటు ?

For Which Ravi Teja's Upcoming Movie You are Eagerly Waiting?

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ “#RT 69 ” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ” ‘ధమాకా ” గా అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ దశమి పండగ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు . ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో రవితేజ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుంది. రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన రవితేజ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో రవితేజ హీరోగా పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” తెరకెక్కనుంది. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్