కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

పోల్

Big Twist In Elimination This Week In Bigg Boss, Bigg Boss Elimination, Big Twist In Elimination, Big Twist in 13th Week Elimination, Big Twist Before Bigg Boss Finale, Bigg Boss 6 Elimination List, Bigg Boss Telugu Season 6, Bigg Boss Season 6, Bigg
ముగిసింది

బిగ్ బాస్ 6-ఈవారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్ ఉంటుందా?

Big Twist In Elimination This Week In Bigg Boss?

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. చూస్తుండగానే చివరి అంఖానికి చేరుకుంది. ఈ ఆదివారం అయిపోతే ఇంకా ఒక్క వారం మాత్రమే ఉంది. ఎప్పుడూ లేని విధంగా 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈసీజన్ కాస్త సో సోగానే సాగింది. ప్రస్తుతం అయితే హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. లాస్ట్ వీక్ టికెట్ టు ఫినాలే టాస్క్ లు జరగగా.. అందులో శ్రీహాన్‌కి టికెటు ఫినాలే పాస్ రావడంతో తాను ఈవారం ఎలిమినేషన్ లో లేడు. ఇక మిగిలిన ఆరుగురు రేవంత్, కీర్తి, శ్రీసత్య, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక వీరిలో రేవంత్ ఎప్పటిలాగే టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. మిగిలిన వారి మధ్య గట్టి పోటీనే నడుస్తుంది. అందుకే ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్టే ఉండబోతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దానికితోడు ఏ సీజన్ లో లేనట్టుగా ఈ సీజన్ లో ఎలిమినేషన్ లో పలు ట్విస్ట్ లు ఇచ్చారు బిగ్ బాస్ యాజమాన్యం. ఊహించనట్టుగా ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. హౌస్ లో ఖచ్చితంగా ఉంటారు అనుకున్న వాళ్ళే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఈ వారం కూడా ఒక్క రేవంత్ ను తప్పిస్తే మిగిలిన వారిలో ఎవరైనా వెళ్లిపోవచ్చు అంటున్నారు. చూద్దాం మరి ఈవారం ఎవరు ఇంటికి వెళతారు.. సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేక డబులు ఎలిమినేషన్ ఉంటుందా.. టాప్ 5 లో ఎవరు స్థానం పొందుతారు లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

పోల్స్

వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్