
2022 బెస్ట్ రీమేక్ సినిమా?
2022 Best Remake Movie
2022 సినీ ఇండస్ట్రీకి కాస్త కలిసొచ్చింది. ఈ ఏడాది ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి. వాటిలో కొన్ని రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. అన్నీ కలిసి ఈ ఏడాది సినీ ప్రేక్షకులను సందడి చేశాయి. ఇక ఈ ఏడాది పలు రీమేక్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. మరి ఆ రీమేక్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఈ ఏడాది వచ్చిన సినిమా భీమ్లానాయక్. ఈసినిమా మలయాళంలో రిలీజ్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈసినిమాతో పవర్ స్టార్ మరోసారి తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చూపించాడు. సినిమాలో పవన్ నటన కానీ అలానే పవన్-రానా మధ్య వార్ కానీ, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని సినిమాను విజయపథం వైపు నడిపించాయి. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన సినిమా గాడ్‌ఫాదర్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిపర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది ఈసినిమా. అయితే ఈసినిమా రిలీజ్ కు ముందు ఎలా ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ సినిమా రిలీజ్ అయి వాటన్నింటిని చేరిపేసింది. పేరుకే లూసిఫర్ రీమేక్ కానీ ఈసినిమా స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా ఓరి దేవుడా. తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ మై కడవులే సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ తన ఎనర్జిటిక్ నటనతో ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా వచ్చిన సినిమా గుర్తుందా శీతాకాలం. ఈసినిమా కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు. ఇక రీసెంట్ గానే రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సత్యదేవ్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది.
పోల్స్



