‘సెబాస్టియన్ పీసీ 524’ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ కామెడీ థ్రిల్లర్..!

Sebastian PC 524 Movie Review,SebastianPC524 Telugu Movie Review,Telugu Filmnagar,Kiran Abbavaram,Nuveksha,Komalee Prasad,Balaji Sayyapureddy,Ghibran,SebastianPC524 Movie Review,SebastianPC524 Review,SebastianPC524 Rating,SebastianPC524 Movie Rating,SebastianPC524 Movie Review And Rating,SebastianPC524 Review And Raing,SebastianPC524 Movie Public Talk,SebastianPC524 Public Talk,SebastianPC524 Movie Public Talk And Public Response,SebastianPC524 Public Talk And Public Response,SebastianPC524 Movie Public Response,SebastianPC524 Public Response,SebastianPC524,SebastianPC524 Movie,SebastianPC524 Telugu Movie,SebastianPC524 Movie Updates,SebastianPC524 Movie Latest Updates,SebastianPC524 Telugu Movie Updates,SebastianPC524 Telugu Movie Latest News,SebastianPC524 Movie Latest News,SebastianPC524 Trailer,SebastianPC524 Songs,SebastianPC524 Telugu Movie Review And Rating,SebastianPC524 Movie Story,Sebastian PC524,Sebastian PC 524,Sebastian PC 524 Review,Sebastian PC524 Review,Kiran Abbavaram Movies,Kiran Abbavaram New Movie,Kiran Abbavaram SebastianPC524,Kiran Abbavaram SebastianPC524 Movie,Kiran Abbavaram SebastianPC524 Movie Review,Kiran Abbavaram SebastianPC524 Review,Nuveksha Movies,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,New Telugu Movies 2022,Telugu Reviews 2022,Telugu Cinema Reviews,Telugu Movies 2022,#SebastianPC524,#SebastianPC524Review,#KiranAbbavaram

బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా సెబాస్టియన్ పీసీ 524. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై మొదటి మంచి అంచనాలే ఉన్నాయి. దానికితోడు టీజర్, ట్రైలర్ తో ఈసినిమాపై అంచనాలు పెంచేశారు చిత్రయూనిట్. మరి నేడు ఆ అంచనాల మధ్య ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఈ యంగ్ హీరోకు మరో హిట్ ను అందించిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్
దర్శకత్వం..బాలాజీ సయ్యపురెడ్డి
నిర్మాతలు..​సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్
బ్యానర్స్.. జ్యోవిత సినిమాస్
సంగీతం.. జిబ్రాన్
సినిమాటోగ్రఫీ.. రాజ్. కె. నెల్లి

కథ..
సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుంటాడు. అయితే అతనికి రే చీకటి ఉంటుంది. అయితే ఉదయం డ్యూటీలు ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ అనుకోకుండా సెబాస్టియన్ కు నైట్ డ్యూటీలు వేయడంతో అనుకోని చిక్కులొచ్చి పడతాయి. ఇక ఏదో ఒకలాగ మేనేజ్ చేస్తుండగా.. ఒకరోజు నీలిమా(కోమలి ప్రసాద్) అనే మహిళ హత్యకు గురవుతుంది. ఆ నేరం కాస్త సెబాస్టియన్ పై పడుతుంది. అసలు ఆ హత్యకు సెబాస్టియన్‌కి మధ్య సంబంధం ఏంటి? అతడిని ఎందుకు సస్పెండ్ చేశారు..? నీలిమాను ఎవరు హత్య చేశారు? సెబాస్టియన్ లవర్ హేలీ(నువేక్ష)కి ఈ కేసుతో సంబంధం ఏంటి? హీరో ఈ కేసును చేధిస్తాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ..

థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇక థ్రిల్లర్ సినిమాలకు కాస్త కామెడీ కూడా జోడించి.. మంచి స్టోరీతో రూపొందిస్తే ఇక సినిమా హిట్ అయినట్టే. ఇక సెబాస్టియన్ కూడా కామెడీ థ్రిల్లర్ జోనర్ లోనే డిఫరెంట్ లైన్ తో తెరకెక్కించాడు డైరెక్టర్ బాలాజీ. ఈసినిమాలో హీరోకు రే చీకటి ఉండటమే హైలెట్ పాయింట్. రేచీకటితో హీరో చేసే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇక థ్రిల్లర్ కాబట్టి సీరియస్ మోడ్ కాకుండా దానికి కామెడీని జోడించి మరింత వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ఫస్టాఫ్ అంతా కామెడీ సన్నివేశాలతో కొనసాగుతుంది.. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ తో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. సెకండ్ హాఫ్ లో అసలైన కథ నడుస్తుంది.

ఇక యంగ్ హీరో కిరణ్ మరోసారి డిఫరెంట్ పాత్రతో అలరించాడు. కానిస్టేబుల్‌గా పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేశాడు కిరణ్ అబ్బవరం. ఆయన కామెడీ టైమింగ్ బావుంది. చిత్తూరు యాసలో డైలాగులు చెబుతూ… చీకటి అంటే భయపడే సన్నివేశాల్లో వినోదం పండించారు. రోహిణి ఎప్పటిలాగే తల్లి పాత్రలో నటించి మెప్పించింది. రోహిణి, కిరణ్ మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ మూవీలో హీరో తర్వాత ఎక్కువగా వినోదాన్ని పంచింది శ్రీకాంత్ అయ్యంగారే అని చెప్పొచ్చు. ఆయన కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. కథలో కోమలీ ప్రసాద్‌ది కీలక పాత్ర. హీరోయిన్ కాదు కానీ… కథంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. నీలిమగా కోమలీ ప్రసాద్ చక్కగా నటించారు. సూర్య, ఆదర్శ్ బాలకృష్ణ, తమిళ నటుడు జార్జ్ మర్యన్, తేజ పాత్రలో కనిపించిన వ్యక్తి పాత్రలకు తగ్గట్టు చేశారు.

ఇక సాంకేతిక విభాగానికి వస్తే జిబ్రాన్ సినిమాకు కావాల్సిన సంగీతాన్ని అందించాడు. పాటల సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు. అలాగే రాజ్ కె.నల్లీ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంట్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా థ్రిల్లర్ సినిమాను ఇష్టపడే వారితో పాటు.. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =