‘మోసగాళ్ళు’ ట్రైలర్ రిలీజ్ – సిస్టమ్‌ని ఆట ఆడించేవాడే కింగ్

Mosagallu Movie Trailer is Out,Vishnu Manchu Mosagallu Trailer Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Mosagallu Telugu Movie Trailer,Vishnu Manchu,Kajal Aggarwal,Suniel Shetty,Mosagallu Telugu Movie Trailer,Mosagallu Trailer,Actor Vishnu Manchu,Kajal Aggarwal,Suniel Shetty,Navdeep,Naveen Chandra,Sam CS,Jeffrey Gee Chin,Manchu Vishnu Mosagallu Trailer,Mosagallu,Mosagallu Movie Trailer,Mosagallu Telugu Movie,Latest Telugu Movie Trailer,Latest Telugu Trailers And Teasers 2021,Kajal Aggarwal New Movie,Manchu Vishnu New Movie Trailer,Manchu Vishnu Movies,Mosagallu Movie,Mosagallu Movie Trailer,Mosagallu,Mosagallu Film,Mosagallu Trailer Out,Mosagallu Trailer Released,#MosagalluTrailer

గతకొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. దీనిలో భాగంగానే ఇప్పుడు మోసగాళ్ళు అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఈసినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది. పేదరికం నుండి బయటపడాలనుకునే హీరో ప్రపంచంలోనే రెండువేల ఆరువందల కోట్ల అతిపెద్ద స్కామ్ చేసి దాన్నుంచి ఎలా తప్పించుకున్నాడనేది ‘మెసగాళ్లు’ కథ అని అర్థమవుతుంది. కొత్త ఎత్తులు వేస్తూ మంచు విష్ణు డ‌బ్బులు కొల్ల‌గొట్ట‌డం.. సునీల్ శెట్టి గ్యాంగ్ వారిని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ట్రైల‌ర్‌లోని స‌న్నివేశాల‌తో పాటు డైలాగ్స్ కూడా సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాయి. ల‌క్ష్మీ దేవి అంత రిచ్ ఎందుకో తెలుసా, నాలుగు చేతుల‌తో సం‌పాదిస్తుంది కాబ‌ట్టి అని కాజ‌ల్ చెప్పిన డైలాగ్‌తో పాటు డ‌బ్బు ఉన్న వాడి ద‌గ్గ‌ర డ‌బ్బు కొట్టేయ‌డం త‌ప్పేమి కాద‌ని రుహానీ చెప్పిన డైలాగ్ కూడా ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది. మొత్తానికి ఈ సినిమాతో మంచు విష్ణు హిట్ కొట్టేలాగనే కనిపిస్తున్నాడు.

కాగా నవదీప్‌, నవీన్‌ చంద్ర, రుహాని సింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు.. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here