రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ టీజర్ ఎట్టకేలకు రానుంది.ఈనెల 16న ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే టీజర్ కు సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది.టీజర్ చూసిన వారైతే ఎక్స్ట్రార్డినరీ అనే రివ్యూస్ ఇస్తున్నారు.టీజర్ వచ్చాక ది రాజాసాబ్ హైప్ డబుల్ కానుంది.ఇక ఈ టీజర్ ను 16న సెలెక్టెడ్ థియేటర్లలో కూడా ప్రదర్శించనున్నారు.టీజర్ లాంఛ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు.దీనికి ప్రభాస్ హాజరయ్యేలా కనిపించడం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మాళవిక మోహనన్,నిధి అగర్వాల్,రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.సుమారు 400కోట్ల బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.డిసెంబర్ 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక ప్రభాస్ ప్రస్తుతం ఈసినిమాతోపాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుగుతుంది.ఇమాన్వి ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: