సూపర్ హీరో తేజ సజ్జా తన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ తరవాత ఇప్పుడు మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీగా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్‌గా, రీతికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తేజ సజ్జా, మనోజ్ మంచు ఫస్ట్ లుక్ పోస్టర్లు, స్పెషల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచు మనోజ్ జన్మదినం సందర్భంగా మిరాయ్ నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
కాగా ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లేను కూడా అందించగా, మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. గౌరహరి సంగీతం అందించగా, శ్రీ నాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో, 2D, 3D ఫార్మాట్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆగస్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తునాన్రు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: