సీతరామంతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు మలయాళం హీరో దుల్కర్ సల్మాన్. ఈసినిమా తరువాత గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.అంతేకాదు ఈసినిమా తో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక నెక్స్ట్ తెలుగులో దుల్కర్ ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు దుల్కర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక మారుమూల గ్రామంకు చెందిన ఓ యువకుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా వరకు తన ప్రయాణం ఎలా కొనసాగించాడు అనే కథతో వస్తుంది.ఈ ఇన్స్పైరింగ్ స్టోరీని అనుకున్నది అనుకున్నట్లుగా తెరమీదకు తీసుకొస్తే దుల్కర్ కెరీర్ కు ఈసినిమా గేమ్ ఛేంజర్ కానుంది. పవన్ సాధినేని ఈసినిమాను తెరకెక్కిస్తుండగా గుణ్ణంసందీప్ , గుణ్ణం రమ్య నిర్మిస్తున్నారు.
ఇక ఈసినిమాతోపాటు ప్రస్తుతం మలయాళం లో రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో కాంత ఒకటి. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది. సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. రానా దగ్గబాటి ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: