ది రాజాసాబ్ టీజర్ ఎప్పుడంటే

the rajasaab teaser is expected to release by the end of this month

రెబల్ స్టార్ ప్రభాస్ ,డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది రాజాసాబ్.ఇంతకుముందెప్పుడు చేయని జోనర్ లో ప్రభాస్ ఈసినిమా చేస్తున్నాడు.హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారంలో ప్రభాస్ కూడా జాయిన్ కానున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఈ వారంలో టీజర్ రావాల్సి వుంది.అయితే అది కాస్త వాయిదా పడింది.రీసెంట్ గానే ప్రభాస్ ఇండియా తిరిగి వచ్చాడు. తను ఇంకా డబ్బింగ్ చెప్పాల్సివుంది.అలాగే మిగితా వర్క్ కూడా ఉండడంతో టీజర్ విడుదల ఆలస్యం కానుంది.అన్ని కుదిరితే ఈ నెల చివర్లో విడుదలచేయాలని చూస్తున్నారు.ఇక ఈ టీజర్ నెక్స్ట్ లెవెల్ లో వుండనుందని ఇన్సైడ్ న్యూస్.

ది రాజాసాబ్ లో మాళవిక మోహనన్,నిధి అగర్వాల్,రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈసినిమా ఈఏడాది చివర్లో విడుదలకానుంది.

ఇక ప్రభాస్ ప్రస్తుతం ఈసినిమాతోపాటు హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది విడుదలకానుంది. ఈసినిమాను పూర్తి చేసి ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మొదలుపెట్టనున్నాడు. అలాగే ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ తో సలార్ 2 కూడా చేయాల్సివుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.