ది రాజాసాబ్ టీజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

The RajaSaab teaser will be out in mid-May

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది రాజాసాబ్.ప్రభాస్ ఇంతకుముందెప్పుడు చేయని జోనర్ లో ఈసినిమా చేస్తున్నాడు.హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతుంది.సమ్మర్ లోనే విడుదలచేయాలనుకున్నారు కానీ కుదరకపోవడంతో వాయిదా వేశారు.రాజాసాబ్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టీజర్ ఎప్పుడేస్తుందో హింట్ ఇచ్చాడు మారుతి. మిడ్ మే నుండి వడగాల్పుల తీవ్రత మరింత పెరుగనుందని ప్రభాస్ పోస్టర్ వున్న   ఆటోని ఎక్స్ లో  పోస్ట్ చేశాడు. సో మే మూడు లేదా నాలుగో వారంలో రాజాసాబ్ టీజర్ రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమన్ ఈరోజు బీజీఎమ్ కంపోజ్ చేయడం స్టార్ట్ చేసాడు. ఇంతకుముందెన్నడూ చూడని విజువల్స్ తో ఈ టీజర్ వుండనుందట. టీజర్ వచ్చాక సినిమాకు బజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుందని టాక్.సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.జూలై లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇందులో మాళవిక మోహనన్,నిధి అగర్వాల్,రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఈసినిమా హిట్ అయితే ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టనున్నాడు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం ఈసినిమాతోపాటు హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.