రెబల్ స్టార్ ప్రభాస్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ది రాజాసాబ్.ఇంతకుముందెప్పుడు చేయని జోనర్ లో ఈసినిమా చేస్తున్నాడు ప్రభాస్.హారర్ కామెడీ డ్రామాగా మారుతి ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.నిజానికి ఏప్రిల్ 10న విడుదలకావాల్సి ఉండగా వాయిదా పడింది.జూలై లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి టీజర్ రానుంది.ప్రస్తుతం అందుకు తగ్గ వర్క్ జరుగుతుంది.కుదిరితే ఉగాదికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఒకవేళ మిస్ అయితే ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కానుంది.టీజర్ తో సినిమా మీద వున్న అనుమానాలు తొలిగిపోతాయని టాక్.ఈటీజర్ నెక్స్ట్ లెవెల్లో వుండనుందంట.
ఈసినిమాలో మాళవిక మోహనన్,నిధి అగర్వాల్,రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఈసినిమా హిట్ అయితే ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టనున్నాడు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం ఈసినిమాతోపాటు హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్నాడు.ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈఏడాది చివర్లో విడుదలకానుంది.ఈసినిమా పూర్తి చేసిన తరువాత ప్రభాస్ స్పిరిట్ మొదలుపెట్టనున్నాడు.సలార్ 2 కూడా చేయాల్సివుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: