మిరాయ్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Teja Sajja’s Mirai Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Super Yodha,Teja Sajja,Teja Sajja Movies,Teja Sajja New Movie,Teja Sajja Latest Movie,Teja Sajja Mirai,Teja Sajja Mirai Movie,Teja Sajja Mirai Release Date,Manoj Manchu,Manchu Manoj Movies,Manchu Manoj New Movie,MIRAI on AUGUST 1st,Mirai On August 1st,Mirai Releasing On August 1st,Mirai Release Date,Mirai Movie Release Date,Mirai Telugu Movie Release Date,Mirai Release Date Update,Mirai Release Date News,Mirai Release Date Announcement,Mirai,Mirai Movie,Mirai Telugu Movie,Mirai Movie Updates,Mirai Movie News,Mirai Update,Mirai Release Date Announced,Ritika Nayak

యంగ్ స్టార్ సూపర్ హీరో తేజ సజ్జా దేశంలో సూపర్ హీరో స్టయిల్ రీడిఫైన్ లక్ష్యంతో ఉన్నారు. హను-మాన్ సినిమా పాన్ ఇండియా అఖండ విజయంతో దూసుకుపోతున్న తేజ, తన నెక్స్ట్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’ తో మరోసారి అందరినీ అలరించబోతున్నారు. ఈ పాన్-ఇండియా యాక్షన్-అడ్వెంచర్ చిత్రంలో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రను పోషిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పాత్ర సూపర్ హీరో స్టయిల్ లో ఎక్సయిటింగ్, డైనమిక్‌గా వుండబోతోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా 8 వేర్వేరు భాషలలో 2D మరియు 3D ఫార్మాట్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

రక్షా బంధన్, స్వాతంత్య్ర దినోత్సవ సెలవులు నేపథ్యంలో మిరాయ్ ఫెస్టివల్ స్పిరిట్‌ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ డేట్ పోస్టర్‌లో, తేజ సజ్జా మంచు పర్వత శిఖరాల మధ్య నిలబడి, ఒక కర్రను పట్టుకుని, ఇంటెన్స్‌గా చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఒక్క పోస్టర్‌లోనే సినిమా గ్రాండియర్ స్పష్టంగా కనిపిస్తుంది.

తేజ సజ్జా అంకితభావం, కృషి ఈ చిత్రం ప్రోమోలలో స్పష్టంగా కనిపిస్తాయి. సూపర్ యోధ పాత్రకు ప్రాణం పోసేందుకు తేజ చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే మిరాయ్‌లో అద్భుతమైన తారాగణం వుంది. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర మెమరబుల్‌గా వుండబోతోంది. తేజ సజ్జా సరసన రితికా నాయక్ కథానాయికగా నటించింది.

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ చిత్రాన్ని గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రంగా మలుస్తున్నారు. స్క్రీన్‌పై పూర్తిగా కొత్త ప్రపంచాన్ని సృష్టించారని ప్రమోషనల్ మెటీరియల్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని అందిచడంతో పాటు డైలాగ్స్ రాస్తున్న మణిబాబు కరణంతో కలసి స్క్రీన్‌ప్లే రాశారు. ఇక ఈ చిత్రానికి గౌర‌హ‌రి సంగీతం అందిస్తుండగా.. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.