లైలా.. సోనూ మోడల్‌కు సూపర్బ్ రెస్పాన్స్

Vishwak Sen’s Laila First Single Sonu Model Impress with Crackling High-tempo Track

మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’ వాలంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు క్యారెక్టర్స్ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే స్ట్రయికింగ్ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌తో దృష్టిని ఆకర్షించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్‌స్టార్ట్ చేస్తూ, మేకర్స్ ఫస్ట్ సింగిల్ సోను మోడల్‌ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాట విశ్వక్సేన్ పాత్ర, సోను మోడల్‌ను పరిచయం చేస్తుంది. అతని పర్సోనా పై ఒక గ్లింప్స్ అందిస్తుంది. ఇది సోను చార్మ్, తన ప్రత్యేక స్కిల్స్ తో అమ్మాయిల మనసులని ఎలా గెలుచుకుంటాడో హైలైట్ చేస్తుంది.

లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ట్యూన్ ఆకట్టుకునే బీట్‌లతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ వైబ్ ఏంథమ్ కి విశ్వక్సేన్ స్వయంగా లిరిక్స్ రాస్తూ ఫన్ నంబర్‌కు పర్శనల్ టచ్ జోడించారు. ఈ పాటను సింగర్స్ నారాయణ్ రవిశంకర్, రేష్మా శ్యామ్ ఎనర్జిటిక్ గా పాడారు. విశ్వక్సేన్, ఎనర్జీతో నిండి, తన డైనమిక్ డ్యాన్స్ మూమెంట్స్ ని ప్రజెంట్ చేశారు. లావిష్ గా చిత్రీకరించిన ఈ పాట విజువల్ ఫీస్ట్‌ను అందిస్తుంది.

ఈ సాంగ్ చార్ట్‌బస్టర్ బిగినింగ్ తో మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ కి స్టేజ్ ని సెట్ చేసింది. ఈ మూవీతో ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.