గత ఏడాది సలార్… ఈ ఏడాది కల్కి 2898 తో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్.ఈ హీరో నుండి నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ది రాజాసాబ్.మారుతి డైరెక్షన్ లో హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ప్రభాస్ ఈ జోనర్ లో నటించడం ఇదే మొదటి సారి.రీసెంట్ గా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈసినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని అవుట్ ఫుట్ కూడా సూపర్ గా వస్తుందని ఇందులో ఓ హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక మోహనన్ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాంగ్స్ షూట్ ఒక్కటీ బ్యాలెన్స్ వుంది.ఈనెలలో అవి కూడా పూర్తి చేసి తరువాత విఎఫ్ఎక్స్ పనులను మొదలు పెట్టనున్నారు.ఇందులో మాళవిక తోపాటు నిధి అగర్వాల్,రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.తమన్ సంగీతం అందిస్తున్నాడు.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజాసాబ్ థియేటర్లోకి రానుంది.ఈసినిమా హిట్ అయితే ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టనున్నాడు.
ఇక ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. త్వరలోనే ప్రభాస్ ఇందులో జాయిన్ కానున్నాడు.ఈసినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈ సినిమాను పూర్తి చేసి ప్రభాస్ ,స్పిరిట్ ను మొదలు పెట్టనున్నాడు.సందీప్ రెడ్డి వంగ ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా టి సిరీస్ నిర్మించనుంది.త్వరలోనే ఈసినిమా లాంచ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: