తేజ సజ్జా బర్త్ డే.. మిరాయ్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Super Hero Teja Sajja’s Birthday Poster Unveiled From Mirai

హను-మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విజయం అందుకున్న సూపర్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్‌’. కార్తీక్ గడ్డంనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్‌లో సూపర్ యోధ పాత్రలో కనిపించనున్నాడు. మనోజ్ మంచు, రితికా నాయక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి తేజ సజ్జా మరియు మంచు మనోజ్ పాత్రలను పరిచయం చేసే ఫస్ట్-లుక్ పోస్టర్లు మరియు గ్లింప్స్ అద్భుతమైన స్పందనను పొందాయి, భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో ఈరోజు తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా, మిరాయ్ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. తేజ సజ్జా చాలా కష్టపడి పనిచేస్తున్నాడని బర్త్‌డే స్పెషల్ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ పోస్టర్ చూస్తుంటే.. తేజ సజ్జా పాత్రలోని సాహసోపేతమైన స్ఫూర్తిని హైలైట్ చేస్తూ సినిమా కోసం రూపొందించిన ఆకర్షణీయమైన ప్రపంచాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. పోస్టర్‌లో తేజ సజ్జ మండుతున్న ఇనుప రాడ్‌ను పట్టుకుని తనను తాను పడిపోకుండా కాపాడుకోవడం, వస్తువులు పైనుండి పడటం కనిపిస్తుంది. ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకుపోయినప్పటికీ తేజ ఎంతో కాన్ఫిడెన్స్ గా ఇంటెన్స్ లుక్ తో కనిపించాడు.

ఇక బ్యాక్ గ్రౌండ్ లో ఒక పురాతన దేవాలయం ఉంది. ఈ పోస్టర్ యాక్షన్ సినిమాల ప్రేమికులను అలరించేలా డిజైన్ చేయబడివుంది. ఇక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో సినిమాటోగ్రఫర్ కార్తీక్ గడ్డంనేని ట్యాలెంట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అత్యున్నత స్థాయి నిర్మాణ ప్రమాణాలతో ఈ సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉండబోతోందనేది కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఈ కొత్త పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గౌర‌హ‌రి సంగీతం అందిస్తుండగా.. మణిబాబు కరణం స్క్రీన్‌ప్లేతో పాటు డైలాగ్స్ రాస్తున్న్నాడు. అలాగే శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ నిర్వహిస్తున్నారు. కాగా మిరాయ్‌ని 8 భాషల్లో వచ్చే యేడాది వేసవి సెలవుల్లో ఏప్రిల్ 18న 2డి మరియు 3డి వెర్షన్‌లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.