మిస్టర్ బచ్చన్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.నిజానికి రేపు రిలీజ్ కానుండగా ఈ రోజు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు.వీటికి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది.ఈ రోజు నైట్ టాక్ ఏంటో తెలిసిపోనుంది.ఇక ఈసినిమా ప్రదర్శించనున్న థియేటర్లలో ప్రభాస్ ది రాజాసాబ్ గ్లింప్స్ ను కూడా ప్లే చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా ఈసినిమా నుండి ప్రభాస్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇప్పుడు ఆ గ్లింప్స్ ను థియేటర్లో కూడా ప్రదర్శించనున్నారు.ఈసినిమాను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నే నిర్మిస్తుంది.ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ టైటిల్ రోల్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు వున్నాయి.డైరెక్టర్- హీరో కాంబినేషన్ కి తోడు సాంగ్స్ ,హీరోయిన్ వల్ల బజ్ బాగా వచ్చింది.
అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ కూడా ఎక్కువగానే వుంది.రేపు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15సినిమాలు వస్తున్నాయి.ఇందులో మేజర్ గా మిస్టర్ బచ్చన్,డబుల్ ఇస్మార్ట్ నుండి పోటీ ఎదుర్కోనుంది.తంగాలన్,ఆయ్ సినిమాల మీద కూడా మంచి అంచనాలు వున్నాయి. మరి మిస్టర్ బచ్చన్ ఈపోటీ ని తట్టుకొని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.హిందీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: