రెబల్ స్టార్ ప్రభాస్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ది రాజాసాబ్.గత ఏడాది సలార్ తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన ఈహీరో ఈఏడాది కల్కితో మరో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు.ఇక రాజాసాబ్ తో హ్యాట్రిక్ పూర్తి చేస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన ప్రభాస్ గ్లింప్స్ కూడా అందుకు తగ్గట్లే వుంది.ఇందులో ప్రభాస్ మేక్ ఓవర్ కు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈసినిమా షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం శంషాబాద్ లో ఓ షెడ్యూల్ జరుగుతుంది.హీరోయిన్స్ అలాగే కమెడియన్స్ పై కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.నెక్స్ట్ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా జాయిన్ కానున్నాడు.ఇప్పటివరకు అయితే సగం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హర్రర్ రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ లో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం. అందులో ఓ హీరోయిన్ గా మాళవిక మోహనన్ కనిపించనుంది.తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లోకి రానుంది.
ఇక ఈసినిమా తరువాత ప్రభాస్ వరస కమిట్ మెంట్ల తో ఫుల్ బిజీ కానున్నాడు.అందులో భాగంగా సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ చేయాల్సివుంది.అలాగే సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి తో ఓ సినిమా కమిట్ అయ్యాడు.త్వరలోనే అనౌన్స్ మెంట్ రానుంది.ఇది పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రానుందట.వీటితో పాటు ప్రభాస్ సలార్ 2,కల్కి 2 కూడా చేయాల్సి వుంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: