పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ పామ్ లో ఉన్నాడు. గత ఏడాది చివరిలో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కట్టిన ప్రభాస్ ఈ ఏడాది కల్కి తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎప్పుడు సందర్భం వచ్చినా పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వప్రసాద్ మరోసారి ఈసినిమా గురించి మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ది రాజా సాబ్ సినిమా అందరూ అనుకుంటున్నా దానికంటే చాలా పెద్ద సినిమా.. ముందు ముందు ఈసినిమా నుండి వచ్చే కంటెంట్ చూస్తే ఆ విషయం అందరికీ అర్ధం అవుతుంది. అలాగే ఈ చిత్రం చాలా పార్ట్ వరకు గ్రాఫిక్స్ తోనే కనిపిస్తుంది.. ఇంకా చాలా అంశాలు సినిమాలో ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఈయన చేసిన కామెంట్స్ కు ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు.
కాగా ఈసినిమాాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈసినిమాకు సంగీతం అందించనున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్ గా.. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా.. ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: