శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా మనమే. కామెడీ ప్లస్ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ఇప్పటికే అప్ డేట్లతో మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథ
ఈసినిమాకు కథే ప్రధాన బలంగా నిలిచేలా కనిపిస్తుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లు రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్ లో శర్వా, కృతిశెట్టి ఒక బాబును పెంచడం చూస్తుంటాం.. ఆ బాబును పెంచే క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే కీచులాటలు ఇంట్రెస్టింగ్ గా, కామెడీగా కనిపిస్తున్నాయి. ఎమోషనల్ కంటెంట్ తో పాటు లవ్ యాంగిల్ కూడా చూపించబోతున్నారు. చూడబోతే డిఫరెంట్ స్టోరీతోనే రానున్నట్టు తెలుస్తుంది.
శర్వా-కృతిశెట్టి కాంబినేషన్
ఈసినిమాకు శర్వా-కృతిశెట్టి కాంబినేషన్ కూడా మరో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఇద్దరి కాంబినేషన్ కూడా బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది. అందులోనూ ఈసినిమా అటు శర్వాకు కానీ ఇటు కృతిశెట్టికి కానీ చాలా ఇంపార్టెంట్. శర్వానంద్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది.. అలానే కృతిశెట్టి కూడా వరుస పరాజయాలతోనే ఉంది. దీంతో ఈసినిమా హిట్ అనేది వీరిద్దరికి చాలా ముఖ్యమైంది.
ప్రొడక్షన్ వాల్యూస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి ఈసినిమా వస్తుంది. మరి ఈ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనస్ట్ బ్యానర్ గా దూసుకుపోతుంది. మనమే తో పాటు ఇంకా బ్యానర్ నుండి చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. మిరాయ్, మిస్టర్ బచ్చన్, రాజా సాబ్ పలు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉంటాయి కాబట్టి చాలా తక్కువ కాలంలో ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యానర్.
శ్రీరామ్ ఆదిత్య
భలే మంచి రోజు సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీరామ్ ఆదిత్య. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. భలేమంచిరోజు, శమంతకమణి, దేవదాస్, హీరో సినిమాలతో అలరించాడు. ఇప్పుడు శర్వానంద్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈసినిమాతో హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య కూడా సినిమా విజయంపై మంచి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాడు. డిఫరెంట్ ప్లాట్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు.
హేషమ్ అబ్దుల్ వాహబ్
మలయాళంలో వచ్చిన హృదయం సినిమాతో అక్కడ మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హేషన్. ఆ తరువాత తెలుగులో ఇక్కడ ఖుషి సినిమాకు పాటలు అందించగా ఆ పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. ఖుషి తరువాత హై నాన్న పాటలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. అంతేకాదు ఈసినిమాలో మొత్తం 16 పాటలు ఉన్నట్టు ఇప్పటికే తెలిపారు. ఈనేపథ్యంలోనే హేషమ్ అందించే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలెట్ గా నిలవనున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: