అదిరిపోయే రేంజ్ లో తేజ సజ్జ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్

teja sajja new movie title glimpse out now

తేజ సజ్జ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్న తేజ ఇప్పుడు హీరోగా మారి తన సినిమాలతో అలరిస్తున్నాడు. ఇక రీసెంట్ గా హనుమాన్ తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ హిట్ కొట్టి దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈసినిమా తరువాత ఏ సినిమా చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా తన తరువాత సినిమాను చేయబోతున్నాడు. ఈసినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రీసెంట్ గానే వచ్చింది. ఈ సినిమాలో సూపర్‌యోధగా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు మిరాయ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

గ్లింప్స్ అయితే ఓ రేంజ్ లో ఉంది. అనగనగా ఒక సామ్రాట్.. సామ్రాట్ అశోక్.. చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్దం అంటూ మొదలైన గ్లింప్స్ అద్భుతంగా ఉంది.. 9 గ్రంధాలు, ఆ గ్రంధాలను కాపాడే 9 మందియోధుడులు.. వాటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించే ఓ గ్రహణం.. ఆ గ్రహణాన్ని అంతం చేసే ఓ యోధుడిగా తేజ సజ్జా కనిపించబోతున్నాడు. అంతేకాదు తేజ సజ్జా యాక్షన్ సీక్వెన్స్ ల్లో కూడా అదరగొట్టేలా కనిపిస్తున్నాడు. మొత్తానికి గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు.

కాగా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. గౌరా హరి సంగీతం అందిస్తున్నాడు.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.