కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా భీమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదా పడి శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా టీజర్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఇప్పుడు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న ఈట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
కలుద్దాం ఈ మహాశివరాత్రికి థియేటర్లలో..!
Presenting the #BHIMAATrailer for you all❤️🔥
– https://t.co/DWDJaKhoTR#BhimaaOnMarch8th@NimmaAHarsha @RaviBasrur @KKRadhamohan @priya_Bshankar @ImMalvikaSharma @SriSathyaSaiArt pic.twitter.com/IZNMOH4eJg
— Gopichand (@YoursGopichand) February 24, 2024
కాగా ఈసినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వామి జే సినిమాటోగ్రాఫర్ కాగా, కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: