మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్య కాలంలో రవితేజకు సరైన హిట్ పడింది లేదు. దీంతో ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఈగల్. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి రానుంది. దీంతో ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. సినిమాకి కావాల్సిన బజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ తో వచ్చేశారు. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: