పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా వాటిలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమా రిలీజ్ వచ్చే ఏడాది అయినా కూడా ఇప్పటినుండే ఎదురుచూస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటం.. దానికితోడు ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా టైటిల్ ఇంకా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన సాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ఈ మూవీ యూనిటి పాల్గొననున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. అమెరికాలో జరగనున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కె చిత్రబృందం పాల్గొననుంది. ఇక అక్కడే వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే అని తెలుపుతూ ఈసినిమా టైటల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో తాాజాగా చిత్రయూనిట్ అప్ డేట్ ఇస్తున్నారు. రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నామని తెలుపుతూ ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు. మరి వాటి ఈజ్ ప్రాజెక్ట్ కే అనేది తెలియాలంటే ఈనెల 20వ తేదీ వరకూ వెయిట్ చేయాల్సింది.
#WhatisProjectK?! Get ready as we unveil the answer to this mystery that has captured the curiosity of millions across the world.
Join Team #ProjectK on July 20 at @Comic_Con, San Diego, USA.#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/UWIVW0KoUn
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 13, 2023
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో అమితాబచ్చన్ ఇంకా దిశా పటాని కూడా నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: