నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ను కూడా ఎప్పటినుండో శరవేగంగా పూర్తిచేస్తున్నారు మేకర్స్. ఎలాంటి గ్యాప్స్ తీసుకోకుండా అనిలి రావిపూడి షూటింగ్ ను పూర్తిచేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ ఈసినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుం ఈసినిమా షూటింగ్ హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. అది కూడా పవర్ ఫుల్ క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ షూట్ లో బాలకృష్ణతో పాటు ముఖ్య పాత్రధారులంతా పాల్గొంటున్నట్టు సమాచారం. బాలయ్య మార్కు మాస్ యాక్షన్ తో ఈ క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. అంతేకాదు దీంతో ఈసినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు.
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: