ఉస్తాద్ రామ్ ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ రిలీజ్ డేట్ మారింది. మొదటగా ఈసినిమాను దసరా బరిలో నిలుపాలనుకున్నారు కానీ ఆసమయం లో పోటీ ఎక్కువగా వుండడంతో ఈసినిమా అనుకున్నదానికంటే ముందుగానే విడుదలకానుంది. ఈ సెప్టెంబర్ 15న థియేటర్లలోకి రానుందని మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమానుండి రామ్ పోస్టర్ ను విడుదలచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Massive Energy Striking Early in Theatres⚡️💥#BoyapatiRAPO Worldwide Release on SEP 15th in Telugu,Tamil, Kannada, Malayalam & Hindi🔥#BoyapatiRAPOonSep15❤️🔥
Ustaad @ramsayz #BoyapatiSreenu @sreeleela14 @MusicThaman @srinivasaaoffl @detakesantosh @StunShiva8 @SS_Screens… pic.twitter.com/2lpwejNekU
— Srinivasaa Silver Screen (@SS_Screens) June 23, 2023
ఈ పోస్టర్ లో రామ్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించాడు. సెప్టెంబర్ 19న వినాయక చవితి కావడంతో లాంగ్ వీకెండ్ సినిమాకు కలిసి రానుంది.ఇక ఇటీవల విడుదలైన ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని సినిమా ఫై అంచనాలను పెంచేసింది.ఇదిలావుంటే రామ్ ఫ్యాన్స్ సినిమా టైటిల్ ఏంటో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా కు టైటిల్ ను లాక్ చేశారట అతి త్వరలో ఈటైటిల్ ను రివీల్ చేయనున్నారు.
బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమా తెలుగుతోపాటు హిందీ,తమిళ,మలయాళ కన్నడ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: